మోకాళ్ళు,కీళ్ళు, నడుము నొప్పులకు కలబంద ముల్లులను తొలగించి పై తొక్క తీసి లోపల గుజ్జును వేరు చేయాలి. ఈ గుజ్జు అరకప్పు ఉండేలా చూసుకోవాలి. మిక్సీ జార్ లో కలబంద గుజ్జు, ఒక స్పూన్ తెల్ల నువ్వుల నూనెను వేసి మెత్తని పేస్ట్ గా చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అరస్పూన్ పసుపు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి దగ్గరకు వచ్చాక పొయ్యి మీద నుంచి దించాలి. ఈ మిశ్రమం 7 రోజుల పాటు నిల్వ ఉంటుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఆవనూనె రాసి మసాజ్ చేసి ఆ తర్వాత తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాసి గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎముకలకు బలాన్ని అందించి నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అలాగే పసుపులో ఉండే లక్షణాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
మోకాళ్ళు,కీళ్ళు,నడుము నొప్పులకు కలబంద, ఆవనూనె !
السبت، 23 نوفمبر 2024
arogyam Health Tips ఆవనూనె కీళ్ళు నడుము నొప్పులకు కలబంద పసుపులో ఉండే లక్షణాలు నొప్పుల నుండి ఉపశమనం మోకాళ్ళు
ليست هناك تعليقات:
إرسال تعليق