బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. అవి చెబితే ఎవరూ తట్టుకోలేరని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో జతకట్టామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందని, కానీ గతంలో మా మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికలలో గెలిచారు కదా..? అది గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇక టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బి.ఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. టీటీడీ బోర్డు లోని 24 మంది సభ్యులలో అందరూ హిందువులే ఉండాలని, అదేవిధంగా ఆలయంలో పనిచేసే వాళ్ళలో అన్యమతస్తులు ఉండకూడదు అంటూ టీటీడీ బోర్డు చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. బి.ఆర్ నాయుడు వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.తిరుమల ఆయన జాగీర్ కాదని ఫైర్ అయ్యారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను నియమించేలా బిల్లులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఒక్క టీటీడీ బోర్డులో మాత్రమే కాదని అనేక హిందూ సంస్థల్లో ఇతర మతస్తుల ప్రవేశానికి అవకాశం ఉండదన్నారు. కానీ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమ్స్ కానీ వారిని ఎందుకు పెట్టాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
ホーム
/
వక్ఫ్ బోర్డు
/
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు !
السبت، 2 نوفمبر 2024
telangana ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమ్స్ కానీ వారిని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు వక్ఫ్ బోర్డు
ليست هناك تعليقات:
إرسال تعليق