ఆంధ్రప్రదేశ్ లోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నామన్నారు. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో హైటెక్నాలజీ, హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం పై, మాపై కక్షతో లబ్దిదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇళ్లు ఇవ్వని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్ లు తీసుకోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని లబ్దిదారులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.
త్వరలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తాం !
الأربعاء، 20 نوفمبر 2024
Andhra Pradesh త్వరలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి పొంగూరు నారాయణ శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై
ليست هناك تعليقات:
إرسال تعليق