భారత్ బ్రాండ్ గోధుమ పిండి, బియ్యం విక్రయాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. వీటిని గతంలో కూడా విక్రయించగా, తాజాగా మళ్లీ కొనసాగిస్తోంది. గతంలో మొదటి విడత ప్రారంభించగా, ఇప్పుడు రెండో విడతగా తక్కువ ధరల్లో విక్రయించేందుకు కేంద్రం ఈరోజు ప్రారంభించింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా ప్రభుత్వం ఈ విక్రయాలను కొనసాగించనుంది. సామాన్యులకు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రెండో విడతగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రెండో విడతలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ స్టాక్ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ రెండో విడతలో రూ.30లకే కిలో గోధుమ పిండిని విక్రయించనున్నట్లు, ఈ పిండి ప్యాకెట్లు 5, 10 కిలోలు ఉంటాయని తెలిపారు. అలాగే కిలో బియ్యం రూ.34కే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ బియ్యం సంచులు 5, 10 కిలోలుగా ఉంటుందని తెలిపారు.
భారత్ బ్రాండ్ విక్రయాలు తిరిగి ప్రారంభం !
الثلاثاء، 5 نوفمبر 2024
national ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఎన్‌సీసీఎఫ్ కేంద్రం ప్రభుత్వం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్రీయ భండార్ నాఫెడ్ భారత్ బ్రాండ్ విక్రయాలు తిరిగి ప్రారంభం
ليست هناك تعليقات:
إرسال تعليق