మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్‌సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్‌నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్‌పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్‌సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.
ホーム
/
శివాజీనగర్
/
ముంబైలో 53 మంది రౌడీషీటర్లు నగర బహిష్కరణ !
الاثنين، 18 نوفمبر 2024
national ఆర్‌సీఎఫ్ నగర్ గోవండీ చెంబూర్ ట్రాంబే తిలక్‌నగర్ దేవ్‌నార్ బాంద్రా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మాన్‌ఖుర్ద్ ముంబైలో 53 మంది రౌడీషీటర్లు నగర బహిష్కరణ శివాజీనగర్
ليست هناك تعليقات:
إرسال تعليق