టాటా టియాగోపై కంపెనీ ఏకంగా రూ.1 లక్ష వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ఆఫర్‌ నవంబర్‌ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. మార్కెట్‌లో ప్రస్తుతం టాటా టియాగో ధర రూ.6.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్‌లో భాగంగా దీనిపై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం రూ. 5.59 లక్షలకే ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి, తక్కువ ధరలో బెస్ట్‌ కారు కోసం చూసేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. టాటా టియాగో కారు XE, XM, XT (O), XT, XZ, XZ+ వంటి 6 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. ఇది మిడ్‌నైట్ ప్లమ్, డేటోనా గ్రే, ఒపాల్ వైట్, అరిజోనా బ్లూ, ఫ్లేమ్ రెడ్ వంటి 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 242 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ దీని సొంతం. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌ 86PS పవర్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. టాటా టియాగో సీఎన్‌జీలో వేరియంట్‌లో కూడా లభిస్తుంది. సీఎన్‌జీ మోటార్ 73PS పవర్, 95 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంటుంది. టాటా టియాగోలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వైపర్స్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ డీఫాగర్‌ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. కారు లోపలి భాగంలో సౌకర్యవంతమైన సీట్లు, విశాలమైన స్థలాన్ని అందించారు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణీకులకు భద్రతను అందించే ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉండటంతో మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. టాటా మోటార్స్‌ నుంచి ఎక్కువ సేల్స్‌ నమోదవుతున్న మోడల్స్‌లో టియాగో మూడో స్థానంలో ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ