శబరిమలకు కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ – కొట్టాయం (07133) మధ్య డిసెంబర్ 5, 12, 19, 26 మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయానికి రైలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొట్టాయం – కాచిగూడ (07134) రైలు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. ఆ తర్వాతి రోజున రాత్రి 11.40 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది. రైలు షాద్‌నగర్, జడ్చెర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ షిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, తిసూర్, అలువ, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్ – కొట్టాయం (07135) రైలు డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రైలు నడువనున్నది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 4.10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. తిరిగి కొట్టాయం – హైదరాబాద్ (07136) రైలు 4, 11, 18, 25, జనవరి 1 తేదీల్లో నడువనున్నది. రైలు గురువారం సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి.. రాత్రి 11.43 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. రైలు బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, యాద్గిర్, కృష్ణా, రాయ్‌చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
హైదరాబాద్ నుంచి శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు !
الثلاثاء، 26 نوفمبر 2024
12 19 26 మధ్య ప్రత్యేక రైళ్లు telangana డిసెంబర్ 5 దక్షిణ మధ్య రైల్వే ప్రకటన హైదరాబాద్ నుంచి శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ليست هناك تعليقات:
إرسال تعليق