ఓలా ఎలక్ట్రిక్ బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఓలా స్పష్టంచేసింది. కస్టమర్లందరికి 5 వేలు డిస్కౌంట్, ఎంపిక చేసిన వారికి రూ.25 వేల వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొంది. అది కూడా కంపెనీలో స్టాక్ పూర్తి అయ్యేవరకు మాత్రమేనని తెలిపింది. ఈ పండుగ ఆఫర్ సమయంలో ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ప్రకటించినట్టుగా కంపెనీ పేర్కొంది. దాంతో ఓలా స్టాక్ 3శాతం పడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఓలా ఎలక్ట్రిక్.. ఆ డిస్కౌంట్ లిమిటెడ్ ఫెస్టివల్ ఆఫర్ అని, ఆ స్కూటర్ అధికారిక ధరలో ఎలాంటి మార్పులేదని వివరణ ఇచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కి లేఖ రాయగా ఓలా ఎలక్ట్రిక్ డిస్కౌంట్ విషయంపై స్పందించింది. పండుగ సమయంలో అందరి కస్టమర్లకు రూ.5వేల డిస్కౌంట్ ఇస్తామని ధృవీకరించింది. అందులో కూడా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అది కూడా ఆ స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అని వివరించింది. మేం ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ధర మార్చలేదు. కొద్దికాలం పాటు ఫెస్టివల్ ప్రమోషన్ నిర్వహిస్తున్నాం. ప్రతి కస్టమర్‌కి రూ.5వేలు సాధారణ డిస్కౌంట్ అందిస్తున్నాం. కొంతమంది కస్టమర్లకు రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, అది పరిమిత స్టాక్‌పై మాత్రమే వర్తిస్తుందని ఓలా స్పష్టం చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ !
السبت، 19 أكتوبر 2024
science technology ఎంపిక చేసిన వారికి రూ.25 వేల వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఓలా ఎలక్ట్రిక్ బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ కస్టమర్లందరికి 5 వేలు డిస్కౌంట్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో
ليست هناك تعليقات:
إرسال تعليق