కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు దాదాపు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు విడుదలయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేశారు. అక్టోబరు, 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ. 1,78,173 కోట్లు రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు ఆర్థిక సాయం అందించడానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది.
రాష్ట్రాలకు చెల్లించాల్సిన కేంద్రం పన్నుల వాటా విడుదల !
الخميس، 10 أكتوبر 2024
173 కోట్లు విడుదల 211 కోట్లు 745 కోట్లు 78 national అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1 ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7 తెలంగాణకు రూ. 3 రాష్ట్రాలకు చెల్లించాల్సిన కేంద్రం పన్నుల వాటా విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق