ఉత్తర్‌ప్రదేశ్ అజంఘడ్‌లోని బిజౌరా గ్రామానికి చెందిన ప్రవేశ్‌మౌర్య అనే వ్యక్తి మోటార్ మెకానిక్. అతడికి మహీంద్రా థార్ అంటే చాలా ఇష్టం. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆ వాహనాన్ని కొనుగోలు చేయలేనని భావించిన ప్రవేశ్ మౌర్య అభిరుచికి తగినట్లుగా ఎనిమిది నెలల్లో కేవలం రూ.2.5 లక్షల వ్యయంతో బ్యాటరీతో నడిచే ఓ మినీ కారును తయారు చేశాడు. నలుగురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే విధంగా దీన్ని రూపొందించాడు. అయితే అది మహీంద్రా థార్‌లానే ఉండటం విశేషం. ఈ కారుకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందులో సామర్థ్యం, పరిధిని పెంచడానికి గేర్లతోపాటు ఎల్‌ఈడీ లైట్లను కూడా అమర్చారు. సామాన్యులు సైతం కొనుగోలు చేసే విధంగా తక్కువ ధరకు దీన్ని తయారు చేసినట్లు మౌర్య ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా ఈ వాహనం రైతులకు ఉపయోగపడుతుందని, వారు తమ అవసరాలకు ఉపయోగించడం ద్వారా వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చని మౌర్య వివరించాడు.
కలలను సాకారం చేసుకున్న మోటార్ మెకానిక్ ప్రవేశ్‌మౌర్య !
الجمعة، 18 أكتوبر 2024
'మినీ థార్'నే తయారు చేశాడు science technology ఎనిమిది నెలల్లో కేవలం రూ.2.5 లక్షల వ్యయంతో కలలను సాకారం చేసుకున్న మోటార్ మెకానిక్ ప్రవేశ్‌మౌర్య
ليست هناك تعليقات:
إرسال تعليق