పండుగ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి విచ్చేశారు. ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే జరుపుకుంటారు. ఈసారి సీఎంగా సొంతూరిలో వేడుకలు జరుపుకుంటుండడం విశేషం. కాగా, రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి నూతన పంచాయతీ భవనం, వెటర్నరీ హాస్పిటల్, అమర జవాను యాదయ్య మెమోరియల్ లైబ్రరీ, బీసీ సామాజిక భవనాలను ప్రారంభించారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి సొంతూరి లో ఘన స్వాగతం !
السبت، 12 أكتوبر 2024
telangana నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి నూతన పంచాయతీ భవనం వెటర్నరీ హాస్పిటల్ సీఎం రేవంత్ రెడ్డికి సొంతూరి లో ఘన స్వాగతం
ليست هناك تعليقات:
إرسال تعليق