అంజీర చాలా రుచికరమైన పండు. దీనిలో ఔషధ గుణాలు ఎన్నోదాగున్నాయి. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన రుచితోపాటు పోషక విలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా తింటే శరీరానికి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. రోజుకు 2 నుంచి 3 అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. దీనిలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. అంజీర్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో కొవ్వు స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. రోజూ రెండు ఎండిన అత్తి పండ్లను తీసుకుంటే, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 60 ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మితమైన ఆహారంగా మారుతుంది. ఈ పండులో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ రోగులలో గ్లూకోజ్ జీవక్రియను పెంచే సమ్మేళనం. దీన్ని పరిమిత పరిమాణంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎండిన అత్తిపండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. మారుతున్న సీజన్‌లో, మనం తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నాము.. దీని కోసం మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.. అప్పుడే మీరు సీజనల్ జ్వరం, దగ్గు, జలుబును నివారించగలుగుతారు. విటమిన్ సి, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎండిన అత్తి పండ్లను తినమని చాలా మంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో మొదటగా తినాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎండిన అంజీర్ అయితే నీటిలో నానాబెట్టుకుని తినడం చాలామంచిది. కడుపునొప్పి, కిడ్నీలో రాళ్లు, కాలేయ వ్యాధి, మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు ఈ పండును తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంజీర - ఔషధ గుణాలు !
الأحد، 6 أكتوبر 2024
arogyam Health Tips అంజీర - ఔషధ గుణాలు కొవ్వు పిండివదార్థాలు రోజుకు 2 నుంచి 3 అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణుల సూచన సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి
ليست هناك تعليقات:
إرسال تعليق