నన్ను చూసి పలువురు అసూయపడుతున్నారు : మలయాళ నటుడు బాలా

الاثنين، 28 أكتوبر 2024

cinema నన్ను చూసి పలువురు అసూయపడుతున్నారు మలయాళ నటుడు బాలా

t f B! P L


లయాళ నటుడు బాలా ఇటీవల నాలుగో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాహాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తనని చూసి పలువురు అసూయపడుతున్నారని అన్నారు. ''మా వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. నా వరకూ నేను రాజు. తను నా రాణి. మా పెళ్లి గురించి తెలిసి ఎవరైనా అసూయపడితే అది వారి తప్పు. అమ్మాయిలు దొరక్క ఇబ్బందిపడే వారందరూ మమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ల దగ్గర డబ్బు లేదు. అందుకే అమ్మాయిలు దొరకడం లేదు. నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నానని విమర్శిస్తున్నారు. ప్రతి దానిలో తప్పులు వెతకడమే వారి పని'' అని బాలా అన్నారు. బాలాకు గతంలో మూడు వివాహాలు జరిగాయి. మలయాళ గాయని అమృతా సురేశ్‌ను ఆయన మూడో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప ఉంది. అనుకోని కారణాలతో విడిపోయారు. ఆయన తమని మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇబ్బందులు పెడుతున్నాడంటూ కొంతకాలం క్రితం ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. కొన్నిరోజులకే బంధువుల అమ్మాయిని నాలుగో వివాహం చేసుకున్నారు. వయసులో తనకెంటే 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోవడం నెట్టింట చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 'టు మచ్‌', 'ఛాప్టర్‌ 6' వంటి తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ