ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుపై విధించిన సస్పెన్షన్ను మంత్రి నారా లోకేష్ ఎత్తివేసినట్టు ప్రకటించారు. 'లోవరాజు తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నాము' అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తుని ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా చేస్తున్న రాజు..ఇటీవల నడిరోడ్డు పై బస్సు రిపేర్ కు రావడం తో బస్సు ముందు దేవర సాంగ్ కు స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఈ వీడియో వైరల్ కావడం తో ఆయన డాన్స్ పై పాజిటివ్ స్పందన రావడమే కాదు, మంత్రి నారా లోకేష్ సైతం రాజు డాన్స్‌ను అభినందించి సోషల్ మీడియా పోస్ట్ చేసారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం రాజును విధుల నుంచి తొలగించారు. ఈ విషయం లోకేష్ దృష్టికి చేరుకోవడం తో ఆయన స్పందించి.. 'లోవరాజు ఉద్యోగం లో చేర్చుకుంటామని, త్వరలోనే కలుస్తాను' అని ట్వీట్ చేసారు. ఈ ప్రకటన తర్వాత ఆర్టీసీ అధికారులు సస్పెన్షన్ ను ఎత్తివేయడం జరిగింది.
ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేత ?
الاثنين، 28 أكتوبر 2024
Andhra Pradesh ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేత ? త్వరలోనే కలుస్తాను' అని ట్వీట్ మంత్రి నారా లోకేష్ ప్రకటన లోవరాజు ఉద్యోగం లో చేర్చుకుంటామని
ليست هناك تعليقات:
إرسال تعليق