తెలంగాణ భవన్ లో ఇవాళ మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశాడు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినపుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి పొట్టిగా ఉంటావు కాబట్టి నిక్కీ నిక్కీ టీవీలో కనపడడానికి చూసినోడివి. నువ్వు మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు.. మరి నీకు బీఆర్ఎస్ పార్టీ మీద కృతజ్ఞత ఉన్నదా” అని ప్రశ్నించారు హరీశ్ రావు. సోనియా గాంధీ బలిదేవత.. వెయ్యి మందిని చంపింది అన్న నీకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అన్నారు. మరోవైపు రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, వేములఘాట్ పై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు తాము సిద్ధమని ప్రకటించారు హరీశ్ రావు. ముందు మూసీ దగ్గరికి వెళ్లి చర్చిద్దాం. ఆ తరువాత రంగనాయక సాగర్ కట్టపై కూర్చుందాం అని తెలిపారు.
నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశాడు !
الجمعة، 18 أكتوبر 2024
telangana నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశాడు మాజీ మంత్రి హరీశ్ రావు సోనియా గాంధీ బలిదేవత వెయ్యి మందిని చంపింది అన్నావు
ليست هناك تعليقات:
إرسال تعليق