ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బాణసంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.

Post a Comment

أحدث أقدم