దీపావళిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 3.64 శాతం కరవు భత్యం పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పెంపు 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏను చెల్లించనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. 2025 మార్చి 31 లోపు రిటైరయ్యే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు.
إرسال تعليق