రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్ సీ చైర్మన్ గా నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో సవాంగ్ తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం ఈ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా అనురాధను ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ గా అనురాధ నియామకం !
الأربعاء، 23 أكتوبر 2024
Andhra Pradesh అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ గా అనురాధ నియామకం రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు
ليست هناك تعليقات:
إرسال تعليق