Ad Code

సల్మాన్‌ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని ఇందుకు తనను క్షమించాలని నిందితుడి నుంచి మరో వాట్సప్ మెసేజ్ !


ల్మాన్‌ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడు మరో మెసేజ్ పెట్టాడు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశానని, ఇందుకు తనను క్షమించాలని కోరుతూ మొదట తాను బెదిరించిన నంబర్‌ నుంచే ముంబై పోలీసులకు మళ్లీ వాట్సాప్‌ మెసేజ్ పెట్టడటం జరిగింది. ఈ మెసేజ్‌లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు… ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కాగా అంతకు ముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu