Ad Code

ఫోన్‌పే సపోర్టింగ్ స్టాఫ్ లో 60 శాతం ఉద్యోగుల తొలగింపు !


ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ లో భారీగా కోతలు విధించింది. గత ఐదేండ్లలో 60 శాతం సపోర్టింగ్ స్టాఫ్ ను తొలగించేసింది. సంస్థ సపోర్టింగ్ స్టాఫ్ 1100 మంది ఏజెంట్ల నుంచి 400 మందికి పడిపోయిందని ఫోన్‌పే వార్షిక నివేదికలో తెలిపింది. ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ దిశగా అడుగులేస్తున్న ఫోన్‌పే లావాదేవీలు 2018-19 నుంచి 2023-24 మధ్య 40 రెట్లు పెరిగాయి. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులో సమర్థత పెరిగిందని ఫోన్‌పే తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో నష్టాలను తగ్గించుకున్నట్లు ఫోన్‌పే వివరించింది. 2022-23లో రూ.2792 కోట్ల నష్టాలు వాటిల్లితే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1996 కోట్లకు దిగి వచ్చింది. 2022-23లో రూ.3085 కోట్ల ఆదాయం సముపార్జిస్తే, గత ఆర్థిక సంవత్సరం 85.5 శాతం పెంచుకుని రూ.5,725 కోట్లకు చేరుకున్నది. ఇందులో 10 శాతం డిజిటల్ పేమెంట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu