పారిశ్రామిక వేత్త రతన్ టాటాతో పాటు ఒక కుర్రాడు ఎక్కువగా కనిపించేవాడు. టాటా భుజాలపైనే చేయి వేసి మాట్లాడేంత సాన్నిహిత్యం అతనికి ఉంది. రతన్ టాటా జనరల్ మేనేజర్ కూడా ఆ కుర్రాడే. అతడే శాంతను నాయుడు. శాంతను రెండు స్టార్టప్స్ కూడా నడిపిస్తున్నాడు. అయితే రతన్‌కి ఎంతో సాన్నిహిత్యంగా ఉండే శాంతను ఆయన మరణంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. రతన్ టాటా మరణించారని తెలిసి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "మీరు దూరం కావడంతో మన స్నేహబంధంలో తీరని లోటు ఏర్పడింది. ఆ లోటు పూరించడానికి మిగిలిన జీవితమంతా వెచ్చిస్తాను. దు:ఖం ప్రేమకు చెల్లించాల్సిన ధర. గుడ్ బై.. నా ప్రియమైన లైట్‌హైస్ " అని భావోద్వేగంతో పోస్ట్ చేశారు. రతన్ టాటా మరణించిన మూడు రోజుల తర్వాత తన ఇన్‌స్టాలో హృదయ విదారకమైన పోస్ట్ పెట్టాడు. ఆయన లేరని తాను నమ్మలేకపోతున్నట్టుగా చెప్పాడు. ఇన్నాళ్లకి ఆయనతో అనుభూతులు గుర్తు చేసుకునే అవకాశం లభించింది. ఆయనికి మళ్లీ నవ్వే అవకాశం ఇవ్వలేను అనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నాను అని శాంతను తన పోస్ట్‌లో రాసాడు. రతన్ టాటా అంత్యక్రియల సమయంలో 31 ఏళ్ల శంతను నాయుడు ఏడుస్తూ కనిపించారు. రతన్ టాటా మృతి తర్వాత తనకు తెలియని వ్యక్తుల నుండి సంతాపం తెలియజేస్తూ పలు సందేశాలు అందాయని , అయితే ఇలాంటి సమయంలో తనకు బలం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు శాంతను. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన ముంబై పోలీసులకి శాంతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. మహారాష్ట్ర లోని పుణెలో తెలుగు కుటుంబంలో జన్మించాడు శాంతను నాయుడు. ఇతడి తండ్రి అప్పట్లో టాటా మోటార్స్‌లో పనిచేసేవారు. కజిన్ టీసీఎస్‌లో ఉద్యోగం. శాంతను తాత టాటా ఎలక్ట్రికల్‌లో పనిచేశారు. అతని తండ్రి టాటా పవర్‌లో పనిచేశారు. ఇలా వీరి కుటుంబం అంతా టాటా కంపెనీలోనే ఉద్యోగం చేయడం విశేషం. ఇప్పుడు శాంతను కూడా అదే బాటలో పయనించాడు.
0 Comments