31 ప్రిడేటర్ డ్రోన్స్ కొనుగోలు కోసం అమెరికాతో ఇండియా ఒప్పందం చేసుకున్నది. అక్టోబర్ 15వ తేదీ ఢిల్లీలో ఈ డీల్ జరిగింది. అమెరికా ఆర్మీ, కార్పొరేట్ ప్రతినిధులతో భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వీటి కోసం 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది . ప్రిడేటర్ డ్రోన్స్ అంటే పైలెట్ లేని అతి పెద్ద డ్రోన్ అన్నమాట. ఈ డ్రోన్ చిన్న విమానం సైజులో ఉంటుంది. ఈ డ్రోన్ ద్వారా నిఘా పెట్టొచ్చు. దేశ సరిహద్దుల్లో గస్తీని పటిష్ఠం చేసుకోవచ్చు. మన ఎక్కడ ఉన్నా ఈ డ్రోన్ సాయంతో చిటికెలో శత్రువులను మట్టుపెట్టొచ్చు. ఈ 31 ప్రిడేటర్ డ్రోన్స్ లో 15 డ్రోన్స్ నౌకాదళంకు, మిగిలిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీలకు భారత రక్షణ శాఖ కేటాయిస్తుంది. దీని వల్ల సముద్రంలో భద్రతా చర్యలు మరింత వేగవంతం కావటంతోపాటు, సముద్రపు దొంగల పనిని ఇట్టే అరికట్టొచ్చు.
0 Comments