గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన 'ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు మత్స్యకారులు, రైతులతో పాటు సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రంతో పాటు పౌరులు కలిసి పని చేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. నిన్న గోవాలో వర్షాలు కురిశాయని, నారాలి పౌర్ణమి రోజున మత్స్యకారులు సముద్రానికి కొబ్బరికాయలు సమర్పిస్తే వర్షాలు ముగుస్తాయని చిన్నప్పుడు చెప్పేవారన్నారు. కానీ, అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణ మార్పులతో అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. వాతావరణ మార్పు సంపన్నులను మాత్రమే ప్రభావితం చేయదని, ఇది సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన మత్స్యకారులు, రైతులను కూడా ప్రభావితం చేస్తోందన్నారు. 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్రం పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, మెరుగుపరుస్తుంది. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని నిర్దేశిస్తుంది. అయితే, ఆర్టికల్ 51A (g) ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతుంది' అన్నారు. దేశంలోని న్యాయస్థానాలు సుస్థిర అభివృద్ధి సూత్రం, కాలుష్యదారుల చెల్లింపుల భావనతో పాటు ఇంటర్-జనరేషన్ ఈక్విటీ ఆధారంగా స్థిరమైన న్యాయశాస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాయని సీజేఐ చెప్పారు. ఇంటర్-జనరేషన్ ఈక్విటీ అనేది అమ్మమ్మలు, తాతయ్యలు మనకు నేర్పించిన విషయాలు అన్నారు. ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని తరతరాలకు అందించడం, మనం గతంలోని పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.
0 Comments