ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7గంటలకు ముగిసింది. మద్యం దుకాణాల కోసం దాదాపు 90వేల వరకు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ, రాత్రి 12గంటల్లోపు ధరావత్తు సొమ్ము చెల్లించేందుకు అబ్కారీశాఖ అవకాశం కల్పించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాల్లో నోటిఫై చేసిన 113 మద్యం దుకాణాలకు 5,700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు క్రోడీకరిస్తున్నారు. విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు దాఖలయ్యాయి. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల పెద్దగా దరఖాస్తులు రాకుండా సిండికేట్ రింగ్ అయింది. సీఎం చంద్రబాబు హెచ్చరికతో మద్యం టెండర్ల ఎపిసోడ్ దారిలోకి వచ్చింది. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి. అని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్‌ను రూ.99కే ఎక్సైజ్ శాఖ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్‌శాఖ ఈ నెల 14న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుంది. అక్టోబరు 15వ తేదీ నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీశాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు !
الجمعة، 11 أكتوبر 2024
90వేల వరకు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు రూ.1800 కోట్ల వరకు ఆదాయం విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ليست هناك تعليقات:
إرسال تعليق