అయినను పోయి రావలె హస్తినకు......!


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ 'ఎక్స్‌'లో విమర్శలు చేశారు. ''సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలతో సిల్వర్‌ జూబ్లీ చేశారు. మూసీ, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్ట కొట్టారు. 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారు. పండగలు లేవు, ఆడబిడ్డలకు చీరలు అందలేదు. అవ్వా తాతలకు పింఛన్‌ లేదు. తులం బంగారం జాడే లేదు.. అయినను పోయి రావలె హస్తినకు'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments