Ad Code

మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన మెటా !


మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, రియాలిటీ ల్యాబ్స్‌ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్‌ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. రిక్రూటింగ్‌, లీగల్‌ ఆపరేషన్‌ వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా, మెటా ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో ఏకంగా 11 వేల మందిపై వేటు వేసింది. ఇక గతేడాది రెండు విడతల్లో సుమారు 10 వేల మందిని ఇంటికి సాగనంపింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దం కావడం టెక్‌ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. లేఆఫ్స్‌ గురించి ఇప్పటికే సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu