హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్ సంచరించింది చిరుత పులి కాదని, అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లి !
السبت، 19 أكتوبر 2024
hyderabad telangana అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లి
ليست هناك تعليقات:
إرسال تعليق