దసరా, దీపావళి పండుగల సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బేసిక్ ప్లాన్ ధరపై రూ.100 తగ్గింపును అందిస్తున్నట్లు అధికారిక X (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. భారత్ ఫైబర్ బేసిక్ ప్లాన్ ప్రస్తుత ధర రూ.499 గా ఉంది. పండుగల సీజన్ సందర్భంగా రూ.100 తగ్గింపు ధర ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్లాన్ ధర రూ.399 గా ఉంటుంది. దీంతోపాటు GST అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. డిస్కౌంట్‌తోపాటు తొలి నెల సర్వీస్ ఉచితం. ఈ డిస్కౌంట్ ఆఫర్ మూడు నెలలపాటు ఉంటుందని ప్రకటనలో తెలిపింది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.249తో ప్రారంభమవుతాయి. అయితే ఈ ప్లాన్ గ్రామీణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఇది కాకుండా రూ.299, రూ.399, రూ.499 ప్లాన్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫైబర్ బేసిక్ ప్లాన్ రూ.399లో (సాధారణ ధర రూ.499) అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 60Mbps వేగంతో 3300GB డేటాను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తక్కువ ధరకే మెరుగైన సేవలను అందిస్తోంది. స్పీడ్ సహా ఇతర ప్రయోజనాల్లో రాజీలేకుండా పనిచేస్తోంది. టెలికాం సేవల్లో కొంత వెనుకబడి ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో మాత్రం దూసుకెళ్తోంది.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పండుగ ఆఫర్ !
الجمعة، 11 أكتوبر 2024
BSNL science technology అధికారిక X (ట్విట్టర్) ద్వారా వెల్లడి దసరా దీపావళి పండుగల సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పండుగ ఆఫర్ బేసిక్ ప్లాన్ ధరపై రూ.100 తగ్గింపు
ليست هناك تعليقات:
إرسال تعليق