తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి భయాన్ని సృష్టిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా హడావుడితో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.
ఆదాయం సృష్టించక పోయినా ఫర్వాలేదు గానీ, ఉన్నది ఊడగొడుతున్నారు !
الاثنين، 7 أكتوبر 2024
telangana ఆదాయం సృష్టించక పోయినా ఫర్వాలేదు గానీ ఉన్నది ఊడగొడుతున్నారు రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
ليست هناك تعليقات:
إرسال تعليق