సినీ నటుడు సాయాజీ షిండే మహారాష్ట్రలో రాజకీయ ఆరంగేట్రం చేశాడు. ఈరోజు అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీలో చేరారు. సాయాజీ షిండేకు కండువాను కప్పి అజిత్ పవార్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం సాయాజీ షిండే మాట్లాడుతూ తాను చాలాకాలంగా సేవా కార్యక్రమాలను చేస్తున్నానని, ఈ సేవల్ని ఇకముందూ కొనసాగిస్తానన్నారు. అజిత్ పవార్ పార్టీని నడిపించే విధానంపై ఆయన ప్రశంసలు కురిపించారు.ఆయన పార్టీ విధానాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకే ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుల పాత్రలను పోషించానని, కానీ ఇప్పటి వరకు నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా మారలేదన్నారు. తాను ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
అజిత్ పవార్ పార్టీలో చేరిన సాయాజీ షిండే !
الجمعة، 11 أكتوبر 2024
cinema maharashtra అజిత్ పవార్ పార్టీలో చేరిన సాయాజీ షిండే ఈ సేవల్ని ఇకముందూ కొనసాగిస్తానన్నారు తాను చాలాకాలంగా సేవా కార్యక్రమాలను చేస్తున్నానని
ليست هناك تعليقات:
إرسال تعليق