టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ ఓడించాలి !

الاثنين، 14 أكتوبر 2024

cricket sports ఆస్ట్రేలియా చేతిలో ఓటమి టీ20 ప్రపంచకప్‌ భారత మహిళల జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ ఓడించాలి భారత్ కు 4 పాయింట్లు

t f B! P L


షార్జాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్ చేసింది. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో రెండు వికెట్లు, రాధా యాదవ్‌, శ్రేయాంక, పూజ తలో వికెట్ తీశారు. అనంతరం 152 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 142 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ (54 నాటౌట్‌) చేసి చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. దీప్తి శర్మ 29, షఫాలీ వర్మ 21 పరుగులు చేశారు. నాలుగు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ప్రస్తుతం భారత్ కు 4 పాయింట్లు దక్కాయి. నేడు పాక్‌తో జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే టీమిండియా ఇంటికి బయలుదేరుతుంది. గ్రూప్‌-ఎలో సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ ఓడించగలిగితే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ గెలిస్తే భారత్, న్యూజిలాండ్‌లతో పాటు 4 పాయింట్లు ఉంటాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా భారత మహిళల జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ