జీవో 29 వెనుక భారీ కుట్ర దాగి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ఎవరూ కోరలేదని చెప్పారు. రీషెడ్యూల్ చేయాలని మాత్రమే అభ్యర్థులు కోరుతున్నారని అన్నారు. జీవో 29పై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని ప్రశ్నించారు.అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనని అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పారు. నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్‌ఎస్ నేతలు చూశారని అన్నారు. నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు. ''నన్ను అరెస్ట్ చేసే దమ్ము తెలంగాణలో ఎవడికి ఉంది. నన్ను అరెస్ట్ చేయలేదు. అడ్డుకున్నారని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ మీ అయ్యా పరువు తీశావ్. యూస్ లెస్ ఫెలో. నీదో బతుకు , నీ అహంకారం వల్లే నీ అయ్యకు ఈ గతి పట్టింది. నీది మనిషి పుట్టుకేనా. నేను పేపర్ లీకేజి చేసినట్లు రుజువు చేయ్. నా సవాల్ స్వీకరించు. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది. నీ బతుకు గురించి నాకు మొత్తం తెలుసు. అశోక్ నగర్ వస్తా అని ఎందుకు రాలేదు . నువ్వో పీకుడు గానివి నీతో ఏం కాదు. డ్రగ్స్ తో నీకు సంబంధం లేదని నిరుపించుకో. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు దేకడం లేదు. అయ్యా పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. మీదో బ్రతుకు ఛీ. కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటే. బీఆర్ఎస్ విధ్వసానికి కుట్ర చేసింది. మేము చేసే ర్యాలీలో చొరబడి లేనిపోని కుట్రలు చేయాలనీ భావించారు'' అని బండి సంజయ్ పేర్కొన్నారు. ''విద్యార్థులు గో బ్యాక్ అని తరమడంతో బీఆర్ఎస్ నేతలు పారిపోయారు. చర్చలకు ఎవరు మమల్ని పిలవలేదు. అక్కడ పోలీసులు అధికారులతో మాట్లాడారు అంతే. నిరుద్యోగుల పక్షాన అశోక్ నగర్ వెళ్లాం. జీవో నంబర్ 29 ద్వారా తెలంగాణ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అందరికి అందివ్వాలని భావిస్తుంది. దీనిమీద రేవంత్ రెడ్డి వైఖరి ఏందో చెప్పాలి. గ్రూప్ రద్దు చేయాలనీ ఎవరు కోరుకోవడం లేదు. గతంలో బీఆర్ఎస్ పేపర్ లీకులు, ఇతర ఇబ్బందులను సృష్టించింది. పరీక్షలు రద్దు కాదు రీషెడ్యూల్ చేయాలనీ అభ్యర్థులు కోరుకుంటున్నారు. గతంలో సెంట్రల్ లైబ్రరీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి బీఆరెస్‌ను తిట్టి హామీలు ఇచ్చి వెళ్లారు. అది నమ్మిన నిరుద్యోగులు మాకు వేయాల్సిన ఓట్లు కాంగ్రెస్‌కు వేశారు. సోనియా గాంధీ బలి దేవత కానున్నారు. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను బూతులతో తిట్టడం సరికాదు'' అని బండి సంజయ్ అన్నారు.
0 Comments