బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 35, రోహిత్ శర్మ 52, విరాట్ కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99, కేఎల్ రాహుల్ 12, రవీంద్ర జడేజా 5, రవిచంద్రన్ అశ్విన్ 15, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 6 పరుగులు చేశారు. బుమ్రా, సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 462 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 107 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఒక దశలో భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ లు త్వరగా ఔట్ అవడంతో భారత్ కు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ ని 90 పరుగులు దాటిన తరువాత దురదృష్టం వెంటాడుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు 7 సార్లు 90ల్లో ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, విలియం 3 చొప్పున వికెట్లు తీయగా.. అజీజ్ పటేల్ 2 వికెట్లు తీశాడు. సౌథి, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు. అనంరతం న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వెలుతురు సరిగ్గా లేదని మ్యాచ్ నిలిపేసారు.
0 Comments