తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. పీసీసీ చీప్ మహేష్ గౌడ్ తో కలిసి ఆయన అక్టోబర్ 17న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై రాష్ట్ర నేతల్లో ఆశలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రేవంత్ ఢిల్లీ బాట పట్టడంతో మళ్లీ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి పర్యటనతో కేబినెట్ విస్తరణపై క్లారిటీ రాబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలల కావోస్తోంది. అప్పటి నుంచి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణమాసం లోపు మంత్రివర్గంలోకి కొత్త మంత్రులు చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడేందుకే పార్టీ పెద్దలు రేవంత్‌ను ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనతో విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 16 సాయంత్రం ఆయన డిల్లీకి వెళ్లబోతున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం తెలంగాణ విషయాలను చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు..ఈ మీటింగ్ లోనే విస్తరణపై క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ నడుస్తోంది.
16న ఢిల్లీ వెళ్లనున్నరేవంత్ రెడ్డి !
الثلاثاء، 15 أكتوبر 2024
16న ఢిల్లీ వెళ్లనున్నరేవంత్ రెడ్డి telangana పీసీసీ చీప్ మహేష్ గౌడ్ తో కలిసి అక్టోబర్ 17న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల ఆశలు
ليست هناك تعليقات:
إرسال تعليق