ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడేందుకు ముహుర్తం ఖారారయ్యింది. ఇప్పటికే పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే తన రాజీనామాను ప్రకటించి, ఈ నెల 22వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిమంది అనుచరులతో మాట్లాడాను, పార్టీ మారాలన్న నిర్ణయం జరిగిపోయింది, జనసేనలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని కూడా ఈనెల 22వ తేదీనే జనసేనలోకి చేరే అవకాశం కనపడుతుండగా, అదే రోజు ఉదయభాను కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గుడ్ బై ?
الخميس، 19 سبتمبر 2024
22వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది Andhra Pradesh జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గుడ్ బై ?
ليست هناك تعليقات:
إرسال تعليق