Ad Code

ఖర్భుజా - ఆరోగ్య ప్రయోజనాలు !


ర్భుజా రసంలో తేనె కలిపి తీసుకుంటే జ్వరంతో బాధపడతున్నవారు శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూజా తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి ఖర్జూజా ఔషధంగా పనిచేస్తుంది. ఖర్భుజాను తీసుకోవటం వల్ల వయస్సు మీదపడినట్లు కనిపించకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మార్చటంలో బాగా ఉపకరిస్తుంది. ఖర్భుజాలోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది. ఖర్భుజాలో ఉండే బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఎ,సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా తోడ్పడతాయి. కంటి చూపును మెరుగు పరచటంలో ఖర్భుజా తోడ్పడుతుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఖర్భుజా జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఖర్భుజాలో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu