తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగింది. మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను నేతలు సన్మానించనున్నారు. రాష్ట్ర రాజకీయాలు, బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించినప్పుడు సీఎల్పీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ లో చేరిన పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, కడియం శ్రీహరి తదితరులు హాజరయ్యారు.
సీఎల్పీ భేటీకి హజరైన అరెకపూడి గాంధీ, దానం నాగేందర్ !
الأحد، 22 سبتمبر 2024
telangana ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దానం నాగేందర్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీకి హజరైన అరెకపూడి గాంధీ
ليست هناك تعليقات:
إرسال تعليق