సీజేఐ డీవై చంద్రచూడ్ తన ఇంట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు, పీఎం మోడీని ఆహ్వానించారు. దీంతో ఇది కాస్త వివాదాలకు కేరాఫ్ గా మారింది. డీవై చంద్రచూడ్ ఇంటికి మోడీ బుధవారం గణపయ్య వేడుకలకు వెళ్లారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవై చంద్రచూడ్ దంపతులు పాల్గొన్నారు. మోడీ పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది కాస్త దేశంలో వివాదస్పదంగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు సైతం ఖండించాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా దీనిపై స్పందించారు. న్యాయమూర్తుల నియమావళిని ఉల్లంఘించినట్లయిందని అన్నారు. రాజ్యంగా పరిధిలో పనిచేసే ఒక అత్యున్నత స్థానంలో ఉండి ఇలాంటి పనులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తారని కూడా ప్రశాంత్ భూషణ్ ట్విట్ చేశారు. ఇదిలా ఉండగా.. మోదీ, డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం పట్ల మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం ఎంత వరకు సమంజసమన్నారు. ఒక పొలిటికల్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడితో, రాజ్యాంగ సంరక్షకుడు సమావేశం కావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందన్నారు. మరోవైపు దీనిపై బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం. మన సంస్కృతిలో భాగమని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. ఇదిలా ఉండగా ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని నిజమైన శివసేన పార్టీగా గుర్తిస్తూ మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే శిబిరం.. అత్యున్నత ధర్మాసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి తప్పుకోవాలని సీజేఐకి ఎంపీ ఏకనాథ్ షిండే సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాలను వ్యతిరేకంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
సీజేఐ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు పీఎం మోడీ హాజరు !
الخميس، 12 سبتمبر 2024
national న్యాయమూర్తుల నియమావళిని ఉల్లంఘించినట్లయిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు వీడియో సోషల్ మీడియాలోవైరల్ సీజేఐ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు పీఎం మోడీ హాజరు
ليست هناك تعليقات:
إرسال تعليق