ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా సర్కిల్ సెర్చ్ ఫీచర్‌ను విస్తరించాలని గూగుల్ అనుకుంటూ ఉంది. జనవరి 2024లో ఈ ఫీచర్ ను ప్రారంభించారు, మొదట శాంసంగ్ గ్యాలక్సీ ఏస్24 సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత గూగుల్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకంగా సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. గూగుల్ లోని సెర్చ్ టు సర్కిల్ ఫీచర్ విజువల్-సెర్చ్ టూల్. దీని ద్వారా వినియోగదారులు దేనినైనా సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన వివరాలను చూసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితం, వెబ్‌లో త్వరితగతిన సెర్చ్ చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ శాంసంగ్, గూగుల్ Pixel ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది త్వరలో ఇతర బ్రాండ్స్ కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కనిపించనుంది. గూగుల్ దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆండ్రాయిడ్ వినియోగదారులు OnePlus, Oppo, Xiaomi, Motorola లాంటి ఇతర బ్రాండ్‌ల డివైజ్ లు ఈ ఫీచర్ ను పొందడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని మాత్రం ప్రచారం జరుగుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ లోకి గూగుల్ సర్కిల్ సెర్చ్ ఫీచర్ ?
الأربعاء، 18 سبتمبر 2024
google motorola oneplus oppo science technology Xiaomi ఆండ్రాయిడ్ ఫోన్ లోకి గూగుల్ సర్కిల్ సెర్చ్ ఫీచర్ ? మొదట శాంసంగ్ గ్యాలక్సీ ఏస్24 సిరీస్‌లో అందుబాటులోకి తెచ్చింది
ليست هناك تعليقات:
إرسال تعليق