హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో ఎనిమిది మంది యువతులను, 18 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఇ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ పార్టీ వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు !
الأربعاء، 11 سبتمبر 2024
18 మంది యువకులు telangana పోలీసులు అదుపులో ఎనిమిది మంది యువతులను ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సినీరంగానికి చెందిన వారు హైదరాబాద్‌లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
ليست هناك تعليقات:
إرسال تعليق