హెచ్ఎండి స్కైలైన్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సరికొత్తగా పరిచయం చేసింది. నోకియా లూమియా మాదిరి డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లో సరికొత్త ఫీచర్స్ మరియు సెల్ఫ్ రిపేర్, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా ఈ ఫోన్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 35,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ hmd.com మరియు రిటైల్ స్టోరేజ్ నుంచి సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను నోకియా లూమియా ను పోలిన డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ సెల్ఫీ రిపేర్ ఫీచర్ తో మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ 100% రీ సైకిల్ అల్యుమినియం ఫ్రెమ్ తో వస్తుంది. 6.55 ఇంచ్ pOLED స్క్రీన్ ఈ ఫోన్ లో వుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 5G చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని హెచ్ఎండి తెలిపింది. ఫోటోలు మరియు మీడియా కోసం ఈ ఫోన్ లో హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. AF తో OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా మరియు 50MP టెలీ ఫోటో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ తో వచ్చింది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. 4600 mAh బ్యాటరీ కలిగి వుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, 15W మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది.
హెచ్ఎండి స్కైలైన్ స్మార్ట్ ఫోన్ విడుదల
الثلاثاء، 17 سبتمبر 2024
100% రీ సైకిల్ అల్యుమినియం ఫ్రెమ్ 6.55 ఇంచ్ pOLED స్క్రీన్ science smart phone technology నోకియా లూమియా మాదిరి డిజైన్ హెచ్ఎండి స్కైలైన్ స్మార్ట్ ఫోన్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق