తెలంగాణలో తగ్గిన చికెన్ ధరలు !


తెలంగాణలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గతవారం క్రితం నగరంలో  కిలో చికెన్ రూ.200లకు పైగానే విక్రయించారు. అయితే ప్రస్తుతం గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో ఒక్కసారిగా నగరంలో మాంసం విక్రయాలు క్రమేపి తగ్గిపోయాని తాజాగా వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా అమాంతం పడిపోయింది. కాగా, నేడు మంగళవారం చికెన్ ధరలు చూసుకున్నట్లయితే.. స్కిన్ లెస్ చికెన్ కిలో ధర మార్కెట్ లో రూ. 183 వద్ద ఉంది. అదే విత్ స్కిన్ చికెన్ ధర రూ.161 వద్ద కొనసాగుతుంది. అయితే ఫామ్ రేటు రూ.89 వద్ద ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే రిటైల్ ధర రూ.111 వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నగరంలో చవతి పర్వదినం ఉన్న నేపథ్యంలో.. మరో 10 రోజులపాటు చికెన్ విక్రయాలు నగరంలో ఎక్కువగా జరగకపోవచ్చని వ్యాపారస్తులు పేర్కొన్నారు. మళ్లీ దసరా సీజన్ ప్రారంభమైతే చికెన్ ధరలు రూజ200 కు పైగా పెరగవచ్చని అధికారులు, చికెన్ షాప్ ఓనర్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ ధరలు భారీగాా తగ్గుముఖం పట్టడంతో.. నాన్ వెజ్ ప్రియులకు ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఫంక్షన్లు, పార్టీలు చేసుకున్నవారికి బాగా కలిసివస్తుందని చెప్పవచ్చు. 

Post a Comment

0 Comments