సముద్రంలో ఒక విలాసవంతమైన నౌకలో ఓ మహిళ సాహసమే చేసింది. ఎన్నో అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకింది. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. కొన్ని పనులు ప్రయత్నించడం కంటే గమనించడమే మేలంటూ రాసుకొచ్చారు. ''నేను ఈ రోజు ఓ కల కన్నాను. ఓ విలాసవంతమైన నౌకలో ఈ రకమైన డైవ్‌ని ఎలా చేయాలో నేర్చుకోవాలని భావించాను. అయితే కొన్నిసార్లు కలలు కలలుగానే ఉంటేనే బాగుంటుంది. వాటిని దూరం నుంచే గమనించడమే మేలు'' అని పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ''నేను మాత్రం ఇలాంటి కల చూడాలనుకోవడం లేదు. ఇది చాలా భయంగా ఉంది'' అని ఒకరు.. ''ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ, పొరపాటు జరిగితే.. ఇక అంతే'' అని మరొకరు.. ''ఈ కల చాలా బాగుంది. ఇది కల మాత్రమే అయితే.. ఇంకా బాగుంటుంది'' అంటూ కామెంట్లు పెట్టారు.
కొన్ని కలలు కలలుగానే ఉంటే మంచిది : ఆనంద్ మహీంద్రా
الأحد، 29 سبتمبر 2024
national ఆనంద్ మహీంద్రా ఎన్నో అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకింది కొన్ని కలలు కలలుగానే ఉంటే మంచిది విలాసవంతమైన నౌకలో ఓ మహిళ సాహసమే చేసింది
ليست هناك تعليقات:
إرسال تعليق