కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేయడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. కాశీకి పోయినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదని భాజపా నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ''రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, గత పదేళ్లలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికర ఆదాయం పెరగని వాళ్లందరి సమాచారం మీ దగ్గర ఉందా? స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేసి.. రైతులను ఆదుకోవాలంటూ రాజధాని వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఞప్తులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? రూ. లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా? కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు భరోసా కల్పించే బాధ్యత మాది. ఇప్పటికే సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రకటించాం. పంటలన్నింటినీ మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది'' అని తుమ్మల పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ