ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు ఈ-క్రాప్‌ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్‌ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ఏవో కాత్యాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ విషయాన్ని స్పష్టం చేసింది. పిఎంఎఫ్‌బివై వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్‌ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుండగా, రబీకి రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఏవో రైతులకు సూచించారు.

Post a Comment

أحدث أقدم