దివీస్‌ సీఈవో దివి కిరణ్‌ ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వరద బాధితుల కోసం ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ. 4.8 కోట్లను దివీస్‌ సంస్థ అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన దివీస్‌ సంస్థను మంత్రి నారా లోకేష్‌ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

أحدث أقدم