అర్హులైన సబ్‌స్క్రైబర్‌లకు ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత డేటా ప్రయోజనం లబిస్తుంది. దీని కోసం ఎయిర్‌టెల్ 5G సేవలు వారి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇది కాకుండా, 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMS లు కూడా ఉంటాయి. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాల్స్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా, వినియోగదారులు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లను పొందుతారు. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో రీఛార్జ్ చేస్తే 2.5GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అలాగే, చందాదారులు ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాకుండా ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, అపరిమిత 5G డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత HelloTunes, Apollo 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. దీనితో 22 కంటే ఎక్కువ OTT సేవల కంటెంట్‌ను చూడవచ్చు. వీటిలో SonyLIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt మొదలైనవి ఉన్నాయి.
ఎయిర్‌టెల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం !
الثلاثاء، 10 سبتمبر 2024
airtel science technology ఎయిర్‌టెల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం దీని కోసం ఎయిర్‌టెల్ 5G సేవలు వారి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి
ليست هناك تعليقات:
إرسال تعليق