ములుగు మున్సిపాలిటీ బిల్లు తో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి !

الثلاثاء، 24 سبتمبر 2024

telangana గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ ములుగు మున్సిపాలిటీ బిల్లు తో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి

t f B! P L


తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో ఇవాళ తెలంగాణ మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క​ మీడియాతో మాట్లాడారు. ''2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్‌ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము'' అని సీతక్క పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ