దసరా పండుగ సందర్భంగా స్కూళ్లు, విద్యాసంస్థలకు అక్టోబర్ 2 నుంచి 14 వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి సెలవులు మొదలవుతాయి. ఆ తర్వాతి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయి. అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు ప్రైవేట్ స్కూళ్లు అక్టోబర్ 1 నుంచే దసరా సెలవులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మే 25న విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అందులో కూడా అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని స్పష్టంగా ప్రస్తావించింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇక వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 23 వరకు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు కొనసాగుతాయి. 2025 ఫిబ్రవరి 28లోగా పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు పూర్తి అవుతాయి. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయి.
0 Comments