Ad Code

నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌, ఆర్కేడ్‌ డెవలపర్స్‌ ఐపీఓలకు అనూహ్య స్పందన !


నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ లిమటెడ్‌ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటితో ముగిసింది. చివరి రోజు నాటికి 110.71 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.777 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఐపీఓలో భాగంగా 2 కోట్ల షేర్లు అందుబాటులో ఉంచగా, 237 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల కోటా అత్యధికంగా 240.79 రెట్ల బిడ్లు అందుకుంది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటా 142.28 ఎట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 30.74 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఐపీఓలో భాగంగా షేరు ధరల శ్రేణిని రూ.249-263గా నిర్ణయించింది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.277 కోట్లు కంపెనీ సమీకరిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్కేడ్‌ డెవలపర్స్‌ ఐపీఓకు కూడా మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 106.40 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. రూ.410 కోట్ల విలువైన 2.37 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. 252 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 163 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 162 రెట్లు, రిటైల్‌ పోర్షన్‌ 50 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. యాంకెర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.122.40 కోట్లను కంపనీ సమీకరించింది. ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.121-128గా నిర్ణయించింది. లాజిస్టిక్స్‌ కంపెనీ వెస్టర్న్‌ క్యారియర్స్‌ (ఇండియా) ఐపీఓ 30.46 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. రూ.493 కోట్ల ఐపీఓలో భాగంగా 2 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. 63 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐ కోటా 44.67 రెట్లు, క్యూఐబీ కోటా 27.99 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 25.77 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. యాంకెర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.148 కోట్లు సమీకరించింది. ఐపీఓల ధర శ్రేణి రూ.163-172గా కంపెనీ నిర్ణయించింది.

Post a Comment

0 Comments

Close Menu